EN

తెలుగు

EN

తెలుగు

తెలంగాణ చేనేత కార్మికులు: కాలంతో చేస్తున్న నిరంతర పోరాటం

చేనేత పరిశ్రమ తెలంగాణలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగం మరియు వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. చేతితో నేసిన సంక్లిష్టమైన డిజైన్లు, మన్నిక గల చేనేత ఉత్పత్తులు రాష్ట్ర  సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్న చేనేత పరిశ్రమ, మరోవైపు అనేక మంది నేత కార్మిక కుటుంబాలకు ఏకైక ఆదాయ వనరుగా ఉంది. 

సంక్లిష్టత మరియు శైలిని బట్టి, చేనేత ఉత్పత్తులను తయారు చేయడానికి చాలా రోజుల సమయం పడుతుంది. మార్కెట్లో ఉత్తమమైన వాటిని తయారు చేయడానికి నేత కార్మికులు అత్యంత శ్రద్ధగా పని చేస్తారు. పనిచేసే రోజులను పరిగణనలోకి తీసుకుంటే, చేతితో నేసిన వస్త్రాలను సృష్టించడం అంత తేలికైన పని కాదు మరియు అనేక మంది వ్యక్తులు చేనేత వస్త్రం తయారీలో నిమగ్నమైతారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో   40,533 మంది చేనేత కార్మికులు ఉన్నారు. ఇందులో వివిధ రకాల సహాయక కార్మికులు సైతం ఉన్నారు. రాష్ట్రంలో 35,762 పవర్ లూమ్స్ ఉన్నాయి. 

రాష్ట్రంలోని చేనేత కార్మికులు పరస్పర ప్రయోజనం మరియు సమన్వయం కోసం సొంత సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు.ప్రస్తుతం తెలంగాణలో 615 నేత సహకార సంఘాలు, 157 పవర్‌లూమ్ సొసైటీలు, 122 గార్మెంట్ సొసైటీలు మరియు 336 చేనేత నేత సహకార సంఘాలు ఉన్నాయి.ఈ సొసైటీల్లో ఎక్కువ శాతం పత్తి సొసైటీలే. 33 పట్టు సంఘాలు, 44 ఉన్ని సంఘాలు ఉన్నాయి. సొసైటీల సంఖ్య పెరగడం చేనేత కార్మికులు ఒకరితో ఒకరు అనుసంధానం అవడానికి, చేనేత ఉత్పత్తులను మధ్యవర్తులు, వినియోగదారులకు అమ్మడానికి మంచి అవకాశం కల్పించింది. 

చేనేత పరిశ్రమ తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం. వారి చేతివృత్తి గొప్పతనం, వారు తయారుచేసిన ఉత్పత్తుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చేనేత కార్మికులు ఉత్తమమైన కళాకృతులను రూపొందించడానికి విభిన్న సాంకేతికతలు, నమూనాలు మరియు రంగులను అవలంబిస్తారు. కొన్ని చేనేత ఉత్పత్తులు అత్యున్నత  డిజైన్లతో దేశం దృష్టిని ఆకర్షించాయి. పండుగ సమయాల్లో అనేక మంది చేనేత వస్త్రాలను ధరించి సందడి చేస్తారు.

నల్గొండ జిల్లాలోని పోచంపల్లి గ్రామాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్య సమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇక్కత్ కళకు పోచంపల్లి గ్రామం ప్రసిద్ది గాంచింది.  తెలంగాణ కు చెందిన గద్వాల ప్రాంతం జరీ చీరల్లో ఖ్యాతి గడించి దేశ వ్యాప్తంగా పేరుగాంచిన చేనేత ప్రాంతం. దేవాలయాల అంచులతో కూడిన నారాయణపేట చీరలు విభిన్నకళకు ప్రతిరూపాలు. గొల్లభామ చీరలు వివిధ నేపథ్యాల్లో, నమూనాల్లో చూడచక్కని విధంగా ఉంటాయి. వస్త్రాలకు అత్యున్నత నేపథ్యం ఉన్నప్పటికీ, వాటి మార్కెట్ పరిమితంగా ఉండి, చేనేత కార్మికులకు రావాల్సినంత లాభం మాత్రం రావడం లేదు. 

ఇవే కాకుండా తెలంగాణ అనేక సాంప్రదాయ కళలకు, చేతి వృత్తులకు పేరుగాంచింది. చేర్యాల పెయింటింగ్స్, నిర్మల్ పెయింటింగ్స్, బాతిక్ పెయింటింగ్స్ విస్తృత పరిధిని కలిగి ఉన్నాయి. నిర్మల్ బిద్రి క్రాఫ్ట్స్, పెంబర్తి నగిషీలు, డోక్రా కళ అత్యంత విభిన్నమైనవి. నల్ల లోహపు వస్తువులు, నిజామాబాద్ చెక్క పరికరాలు, నిర్మల్ ప్రింటెండ్ ఫర్నీచర్, రెడ్ సెండర్స్, నిర్మల్ బొమ్మలు మార్కెట్ లో ఆదరణ పొందాయి.

తొలి నాళ్ల నుండీ చేేనేత కార్మికులు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రపంచీకరణతో వారి ఇబ్బందులు మరింత పెరిగాయి. సాంకేతికత పెరుగుదల కారణంగా చేనేత కుటుంబాలు, ఆధునిక పద్దతులతో పోటీ పడటానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తక్కువ ఖర్చు కారణంగా కంపెనీలు అనుసరిస్తున్న ఆధునిక పద్దతులు చేనేత రంగం కంటే ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. సాంకేతికతను ఉపయోగించి అసాధరణ వేగంతో ఉత్పత్తులను తయారు చేసే విధానాల చేనేత కార్మికులకు ప్రతికూలంగా మారాయి. 

అటువంటి పోటీని ఎదుర్కొన్నప్పటికీ, చేనేత కార్మికులు తమ పూర్వీకుల నుండి వచ్చిననైపుణ్యాన్ని ఉపయోగించుకుని, తమ స్థాయిని,ప్రత్యేకతను నిలుపుకోవడానికి చాలా ప్రయత్నించారు. సాంప్రదాయ నైపుణ్యంతో అద్బుతమైన వస్త్రాలను తయారు చేశామనే ఆనందం కంటే, మరుసటి రోజు ఏం జరుగుతుందోనన్న దిగులుతోనే చేనేత కార్మికులు నిద్రపోతారు. చేనేత కార్మికుల సాంప్రదాయ నైపుణ్యాలు తెలంగాణ చారిత్రిక వైభవంలో కీలక పాత్ర పోషించన విషయాన్ని ఒప్పుకుంటూనే, మారుతున్న కాలానికి అనుగుణంగా వారి జీవిత పరిస్థితులు మెరుగుపడేందుకు చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంతైనా ఉంది. 

Share:

Related Posts

తెలంగాణ చేనేత కార్మికులు: కాలంతో చేస్తున్న నిరంతర పోరాటం

చేనేత పరిశ్రమ తెలంగాణలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగం మరియు వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. చేతితో నేసిన సంక్లిష్టమైన డిజైన్లు, మన్నిక గల చేనేత ఉత్పత్తులు రాష్ట్ర  సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా

చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ 

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ చేనేత రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా కారణంగా మార్చి 2020 నుండి  విధించిన లాక్ డౌన్ చేనేత రంగానికి పెను సవాలుగా మారింది.

అసమానతలను తగ్గించడానికి తీసుకున్న చర్యలు

అన్ని రకాల ప్రజలు సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు పొందినప్పుడే లింగ సమానత సాధ్యమవుతుంది. లింగ అసమానత మహిళలు, పురుషులు, విభిన్న రకాల ప్రజలు, పిల్లలు, కుటుంబాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. వివిధ

లోటు పూడ్చం : లింగ సమానత్వం మరియు ముందుకు సాగే మార్గం

65 కోట్ల మహిళలు గల భారతదేశం, 2021 లో ప్రపంచ లింగ బేధ నివేదికలో 28 స్థానాలు దిగజారి, 156 దేశాల్లో 140 వ స్థానంలో నిలిచింది.  దేశంలో లింగ అసమానత 62.5 శాతం

Search