మా నిబద్దత
వ్యవసాయ రూపాంతరణ
కష్టాలలో ఉన్న రైతులను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నాము.
అవలోకనం
రైతుల బంగారు భవిష్యత్తు కోొసం స్థితిస్థాపకత మరియు స్థిరత్వాన్ని పెంచడం
పేదరికం, ఆకలి నుండి బయటపడటానికి, వాతావరణ మార్పులను, జీవవైవిధ్య నష్టం మరియు పెరుగుతున్న గ్రామీణ-పట్టణ అసమానతలను పరిష్కరించడానికి వ్యవసాయానికి మంచి గుర్తింపు ఉంది. మహిళలు మరియు బాలికలకు ఆర్థిక అవకాశాలతో సాధికారత కల్పించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వ్యవసాయ ఆధారిత రంగంలో సకారాత్మక ప్రభావం చూపేందుకు మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ పని చేస్తోంది. అందుకోసం సుస్థిర సాంకేతికత, విధానాలను గుర్తించి అమలు పరుస్తోంది. తద్వారా పంట ఉత్పాదకతను పెంపొందిస్తోంది. సన్నకారు, మహిళా, మైనారిటీ రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తోంది.
రూ.1,697/-
తెలంగాణ రైతులకు ప్రతి నెల మిగులుతున్న ఆదాయం
4 వ
రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ స్థానం
7000 కు పైగా
2014 నుండి తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు.

ఒక సూక్ష్మ పరిశీలన
వ్యవసాయం పురాతన కాలం నుండి సంస్కృతిలో ముఖ్యమైన భాగంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో కీలకమైంది. భారతదేశ జిడిపిలో 17% వాటాతో ఆర్థిక వ్యవస్థకు కీలకమైన సహకారం అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా ఉపాధి కోసం వ్యవసాయ పరిశ్రమపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది.
తెలంగాణ శ్రామికశక్తిలో సగానికిపైగా వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతోంది. ఇది రాష్ట్ర వృద్ధికి కీలకం (60 శాతం). ఫలితంగా తెలంగాణ రాష్ట్ర రైతుల ఆదాయం వ్యవసాయ ఉత్పాదకత మరియు మార్కెట్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
కొన్ని గ్రౌండ్ రియాలిటీస్
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి, 7,409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో ప్రభుత్వం 1,598 మాత్రమే గుర్తించింది. 1,598 కుటుంబాలలో, సుమారు 1,300 మందికి మాత్రమే పూర్తి పరిహారం లభించింది, మరికొందరు ఇంకా దానిని అందుకోలేదు. (రైతు స్వరాజ్య వేదికా)
రైతుల ఆత్మహత్యలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నాల్గవది (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, 2020)
తెలంగాణ రైతులకు నెలకు రూ .1,697 నికర ఆదాయం మాత్రమే ఉంది (లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన నివేదిక)
రైతు కుటుంబాలు నష్టపోయినప్పుడు గ్రామీణ సమాజాలు కూడా బాధపడతాయి. క్రమంగా దేశం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇటీవలి సంవత్సరాలలో రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, పేలవమైన వేతనాల పెరుగుదల తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటిగా నిలుస్తున్నాయి.

తగినంత వర్షపాతం లేకపోవడం పంట/దిగుబడి నష్టాలకు కారణమవుతుంది. రికార్డుల ప్రకారం, ఊహించని వర్షాలు మరియు క్లిష్టమైన ఎదుగుదల దశల్లో నీటి కొరత కారణంగా అనేక సీజన్లలో గరిష్టంగా పంట వైఫల్యాలు సంభవించాయి. దీనికి తోడు గోదావరి, కృష్ణా అనే రెండు ప్రధాన నదులు రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నప్పటికీ సరైన నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడం అనేక చోట్ల కనిపిస్తున్నది. సమగ్ర వ్యవసాయ విధానాలు మరియు ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్‌మెంట్ అప్లికేషన్ లేకపోవడం వ్యవసాయ రంగం అభివృద్ధిలో భారీ అంతరాలను సృష్టిస్తోంది. యాంత్రీకరణ పరిమిత వినియోగం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు అవసరమైన సౌకర్యాలు, ఆర్థిక సహాయం అందుబాటులో లేకపోవడం సంవత్సరాలుగా వ్యవస్థను వేధిస్తున్న సమస్యలు. పైన పేర్కొన్న వాటితో పాటు, రైతులు మరియు అనుబంధ కార్మికులకు ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన సహాయం గురించి, పరిశ్రమ నైపుణ్యాలు, పథకాల గురించి సరైన అవగాహన ఉండటం లేదు.
దేశంలోని దాదాపు 50 శాతం మంది కార్మికులకు ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంలో కీలకమైన సమస్యలను మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ ప్రత్యక్షంగా చూసి గుర్తించింది. ఈ ఫౌండేషన్ రైతులను, గ్రామీణ వర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యే పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. కేవలం నగరాల్లోనే కాకుండా తెలంగాణ అంతటా ఆరోగ్యకరమైన, శక్తివంతమైన గ్రామీణ వ్యవసాయ వర్గాలను పునరుద్ధరించడానికి కృషి చేస్తోంది.
మా విధానం
మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ ద్వారా రాబోయే 3 సంవత్సరాలలో మహిళా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో సహా కనీసం లక్ష మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
మా పని
రైతులను భాగస్వాములను చేస్తూ సుస్థిరమైన, సమానమైన సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాము. అదే విధంగా ఆహార పరిశ్రమను మెరుగుపరిచేందుకు తోడ్పాటును అందిస్తున్నాము. ప్రతి స్థాయిలో నేటి, రేపటి అవసరాలకు అనుగుణంగా వ్యవసాయం, ఆహార వ్యవస్థల అభివృద్ధికి కృషి చేస్తున్నాము.

దీన్ని చేయడానికి, మేము వీటిపై దృష్టి పెడుతున్నాము:

పర్యావరణ అనుకూలమైన, తక్కువ ఖర్చుతో కూడిన, మంచి వ్యవసాయ పద్ధతులు మరియు శాస్త్రీయ విధానాలతో కూడిన పరిష్కారాలు నాణ్యత, దిగుబడి పరిమాణాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా ఆదాయాలు పెరుగుతాయి.

సరళమైన వ్యాపార వ్యవస్థ మరియు వినియోగదారుడు కోరుకునే నాణ్యత గల ఆహారాన్ని అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా మధ్యవర్తల ప్రమేయం తగ్గి రైతుల జీవనోపాధి మెరుగుపడుతుంది.

పంటలు, తోటలు మరియు పశువుల అభివృద్ధికి దారితీసే పర్యావరణ-సురక్షిత (ఆకుపచ్చ) వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం.

ఈ వ్యవస్థలో చేరికను పెంపొందించడానికి, స్థితిస్థాపకత మరియు ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడానికి విద్య మరియు నైపుణ్య శిక్షణ ద్వారా మహిళా రైతులకు సాధికారత కల్పించడం

వాతావరణ సమాచారం, వ్యవసాయ సలహాలు ఇచ్చి రైతులకు ఉపయోగపడే డాటా కేంద్రాలను ఏర్పాటు చేయడం.

రైతులకు మరియు వినియోగదారులకు మధ్య మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేసి మార్కెట్ ను మరింత అందుబాటులోకి తీసుకురావడం.

తెగులు నివారణకై అత్యుత్తమ విధానాలు.

నీటి సేకరణ మరియు సంరక్షణ పద్ధతులు.

మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ లక్ష్యాలను సాధించేందుకు స్వచ్ఛంధ సేవా సంస్థలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశ్రమల భాగస్వాములు ఇతరులతో కలిసి పనిచేస్తోంది. తద్వారా రాష్ట్రంతో పాటు దేశంలోని వ్యవసాయ అనుబంధ వ్యవస్థలపై సకారాత్మక ప్రభావం చూపే ప్రయత్నం చేస్తోంది.