మా లక్ష్యాలు
చేనేత కార్మికులతో
చేనేత కళలకు స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా చేనేతకారుల జీవితాలతో పాటు మన జీవితాలను మార్చే ప్రయత్నం
సారంశం
చేనేత,క్రాఫ్ట్ రంగంలో పురోగతి మరియు అవకాశాలు కల్పించడం
భారత స్వాతంత్య్రానికి మునుపు చేనేత కళలు ఎంతో ప్రాధాన్యం పొందాయి. గాంధీజి స్వాతంత్య్ర పోరాటంలో కేంద్ర బిందువుగా నిలిచాయి. పారిశ్రామీకీకరణ అనంతరం చేనేత కళల ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది.
సమగ్రంగా రూపొందించి విధానాలు, కార్యక్రమాల లోపం, డిమాండ్ పెరగడం, నకిలీ, అత్యధిక ఉత్పాదకత ఉన్న ఉత్పత్తులు అందుబాటులోకి రావడం వంటి అంశాలు చేనేత వస్త్రాల విక్రయాలతో పాటు చేనేతకారుల కుటుంబాల జీవనోపాధిపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి.
వివిధ దశల్లో చొరవ తీసుకుంటున్న మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ పత్తి రైతులను భాగస్వాములను చేసుకుంటూ వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా చేనేతకారుల సామర్థ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. తద్వారా చేనేత కళాకారులకు గౌరవప్రదమైన ఆర్థిక జీవితాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తోంది.
నెలకు రూ.5000 కంటే తక్కువ
67% చేనేత కుటుంబాల సంపాదన
360
2014 నుండి ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల సంఖ్య
59,325
తెలంగాణలోని చేనేత కార్మికులు


సూక్ష్మ పరిశీలన
సామర్ద్యాన్ని పెంచండి, చేనేతలే మన బలం
తెలంగాణ చేనేత వర్గాల వారు భారతీయ పురాతన చేనేత కళలను శతాబ్దాలుగా పరిరక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రెండో రంగం కూడా చేనేత రంగమే. తెలంగాణ సంస్కృతిని ఈ హస్త కళలు ప్రతిబింభిస్తాయి. వాటి అందమైన కళాకృతి వల్ల తరతరాలు నిలిచిపోయేలా రూపొందుతున్నాయి.
నాణ్యత, డిజైన్‌ల ఆధారంగా చేనేత వస్త్రాల ఉత్పత్తికి రోజుల పాటు సమయం పడుతుంది. మార్కెట్లో ఉత్తమమైన ఉత్పత్తి చేయడానికి చేనేతకారులు విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఇందులో ఎంతో మంది భాగస్వాములు అవుతారు. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో 40,533 చేనేత కార్మికులతో పాటు అనుబంధ పనివారు ఉన్నారు. 35,762 చేనేత మగ్గాలు రికార్డుల్లో ఉన్నాయి.
చేనేత కార్మికులు పరస్పర ప్రయోజనం, సహకారం కోసం సొంత సంఘాలు, సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 615 చేనేత సహకార సొసైటీలు, 157 పవర్ లూమ్ సొసైటీలు, 122 గార్మెంట్ సొసైటీలు, 336 చేనేత కార్మిక సహకార సొసైటీలు ఉన్నాయి. కాటన్ సొసైటీలు ఎక్కువగా ఉన్నాయి. 33 సిల్క్, 44 ఉన్ని సొసైటీలు ఉన్నాయి. సొసైటీలు పెరగడం వల్ల చేనేత కార్మికులకు పరస్పరం చర్చించుకోవడంతో పాటు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునే అవకాశాలు మెరుగుపడుతాయి.
ఆటుపోట్లు
ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం ముఖ్యమైనది. కనీస మూలధన పెట్టుబడి, బలమైన ఎగుమతి, విదేశీ మారక ద్రవ్య సంపాదన సంభావ్యత వల్ల మాత్రమే కాదు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో దాని అనుసంధానం వల్ల కూడా. కాటన్-టు-ఫాబ్రిక్ ప్రక్రియపై ఆధారపడిన అనేక పరిశ్రమలు ఉన్నాయి.
ఎక్కువ శాతం చేనేత కార్మికులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను చెందినవారే. 67 శాతం చేనేత కుటుంబాలు నెలకు రూ.5 వేల కంటే తక్కువ సంపాదిస్తున్నాయి. వారంతా అప్పటికే పేదరికంలో జీవిస్తూ, తక్కువ వనరులతో జీవిస్తున్నారు. అంతేకాకుండా వారు తయారు చేసిన ఉత్పత్తులను అమ్మి జీవనోపాాధి పొందడంలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు కరోనా, లాక్ డౌన్ లు వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి.


ప్రధాన సవాళ్లు
ముడి సరుకు ధరలు పెరగడం
నాణ్యతలేని ముడి సరుకులు
రుణాలు, నిధులు అందించే పథకాలు లేకపోవడం
సంక్షేమ పథకాలు లేకపోవడం
ఆధునీకరణ లోపించడం
సరిపడా లేని పరిశోధన మరియు అభివృద్ధి
పవర్ లూమ్స్ రావడం
మార్కెట్ అనుసంధానం మరియు మార్కెటింగ్ లో మద్దతు లేకపోవడం
నవతరంలో ఆసక్తి లేకపోవడం
స్థిరమైన మరియు పెద్దఎత్తున ఆర్డర్లు లేకపోవడం
అసంఘటిత ఉత్పత్తి
డిజైన్ జోక్యం లేకపోవడం
మధ్యవర్తుల ఆధిక్యం
తీవ్రమైన వృత్తిపరమైన కుంగుబాట్లు
మా పని
ఈ అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు అవకాశాలను విస్తరించేందుకు చేనేత కుటుంబాలు, సంఘాలు, సహకార సంఘాలు, టెక్స్‌టైల్ విభాగాలు మరియు బ్రాండ్‌లతో కలిసి పనిచేసిన మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్‌కు దశాబ్ద కాల చరిత్ర ఉంది. అన్ని విధాలుగా పనిచేస్తూ చేనేత రంగాన్ని మెరుగుపరిచి దాని మీద ఆధారపడ్డ కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకురావడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. పోచంపల్లి, కరీంనగర్, వరంగల్, ఉప్పాడ, పొందూరు లోని మగ్గాల నుండి కళంకారి, పెడన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ల వరకు అన్నింటి మీద ఫౌండేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.
మా పని
ఈ అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు అవకాశాలను విస్తరించేందుకు చేనేత కుటుంబాలు మరియు సంఘాలు, సహకార సంఘాలు, టెక్స్‌టైల్ విభాగాలు మరియు బ్రాండ్‌లతో కలిసి పనిచేసిన మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్‌కు దశాబ్ద కాలం పాటు చరిత్ర ఉంది. 360 విధానంలో పనిచేస్తూ చేనేతను మరింత మెరుగుపరిచి, దాని మీద ఆధారపడ్డ కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకురావడం ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం. పోచంపల్లి, కరీంనగర్, వరంగల్, ఉప్పాడ, పొందూరు లోని మగ్గాల నుండి కళంకారి, పెడన హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ల వరకు అన్నింటి మీద ఫౌండేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది.

మేము దీన్ని ఎలా చేస్తాము
మేము సమస్యలను పరిష్కరించడంతో పాటు, చేనేత పరిశ్రమలోని నిపుణుల భాగస్వామ్యంతో కార్మికులకు అధిక ప్రయోజనం కల్గించేలా చేస్తాము

మార్కెట్ మరియు గ్లోబల్ మార్కెట్ తో అనుసంధానం.

పరిశోధన, డాక్యుమెంటేషన్ మరియు వ్యాప్తి చేయడం.

డిజైన్ మెరుగుపర్చడం, ఉత్పత్తి మెరుగుదల, నాణ్యత.

ఉత్పత్తి, ఆదాయాన్ని పెంచే నమూనాలను తయారు చేయడం.

కళాకారుల సామర్థ్యాన్ని బలపరచడం.

ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం.
లాక్డౌన్ మరియు సామాజిక భద్రత లేకపోవడం కారణంగా చాలా మంది కళాకారులు మగ్గాలను విడిచిపెట్టారు. వారి జీవనోపాధిని కొనసాగించడానికి కూరగాయలు అమ్మడం, సెక్యూరిటీ గార్డులుగా లేదా రోజువారీ కూలీలుగా పనిచేయడం వంటి పనులను చేపట్టారు. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ చేనేత వర్గాలకు రేషన్ మరియు అత్యవసర సరకులను అందించడంతో పాటు, వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు సాయపడింది.
సావిత్రమ్మ స్కిల్ ద్వారా చేనేతకారుల నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు వారి జీవనోపాధి మెరుగుపర్చి, చేనేత ఉత్పత్తుల నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నాము. ఈ నైపుణ్య శిక్షణ చేనేత కార్మికులకు వ్యాపార మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, డిజైన్ విద్య మరియు డిజిటల్ అక్షరాస్యతను అందించడానికి బలాన్ని అందిస్తుంది. తద్వారా వారు స్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోగలరు.