EN

తెలుగు

EN

తెలుగు

మా లక్ష్యాలు

అందరికీ పోషకాహారం

పోషకాహార లోపం, ఆకలికి వ్యతిరేకంగా పోరాడటం

అవలోకనం 

పోషకాలు అధికంగా ఉండే పంటలను పెంచడం

ఆహార వ్య‌వ‌స్థ‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, వాతావ‌ర‌ణ పునరుత్పాద‌క‌త‌, పున‌ర్నిర్మాణ సామ‌ర్థ్యం ఉంది. పౌష్టికాహారాన్ని ఉత్ప‌త్తి చేసేవారికి త‌గిన లాభాల‌ను క‌లిగిస్తూ పౌష్టిక‌మైన వాతావ‌ర‌ణాన్ని మేము రూపుదిద్ద‌గ‌ల‌ము. ప్ర‌జ‌లకు, భూమికి కావాల్సిన పోష‌కాల కోసం మేము సుస్థిర‌మైన మ‌రియు స‌మాన విధానాన్ని అవ‌లంబిస్తున్నాము.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో మ‌ర్రి చెన్నా రెడ్డి ఫౌండేష‌న్ ప్ర‌జ‌ల్లోని పోష‌కాహార లోపం తొల‌గించేందుకు క్షేత్ర స్థాయి విధానాల‌తో ప‌నిచేస్తుంది.

53.53 Lakh

తెలంగాణలో రక్తహీనత ఉన్న తల్లులు

16.34 Lakh

తెలంగాణలో రక్తహీనత ఉన్న పిల్లలు

46%

తెలంగాణలో పదేళ్ల కంటే తక్కువగా చదువుకున్న మహిళలు

ఆరోగ్యం, అభివృద్ధిని నాణ్య‌మైన పోష‌కాహారం నిర్ణ‌యిస్తుంది

అప్పుడే పుట్టిన పిల్లలు, చిన్నపిల్లలు మరియు తల్లుల బలమైన ఆరోగ్యానికి మంచి పోషకాహారం పునాది వేస్తుంది. బలమైన రోగ నిరోధక వ్యవస్థ, సురక్షిత గర్భం, ప్రసవం వంటి వాటికి స‌హ‌క‌రిస్తుంది. డయాబెటిస్, హృదయ సంబంధ లాంటి వ్యాధులను తగ్గించడానికి, దీర్ఘాయుష్షుకు తోడ్పడుతుంది.

పోషకాహార లోపం శారీరక, మానసిక పెరుగుదల పెను ప్రమాదం. చిన్న స్థాయి లోపం కూడా శారీరక, మానసిక పెరుగుదలపై ప్రభావం చూపడంతో పాటు చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గుదల, గర్భిణీల్లో సమస్యలు, పునరుత్పత్తి తగ్గడం లాంటి ప్రమాదాలకు దారి తీస్తుంది. ఆకలి, పోషకాహార లోపం చిన్న పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యంపై ప్రభావం చూపి వారి చదువులను, పురోగతిని తగ్గిస్తుంది. సరైన పోషకాహారాన్ని పొందడం అనేది మొత్తం మానవ, దేశ అభివృద్ధికి కీలకం. దాంతో పాటు విద్యలో మెరుగైన ఫలితాలు, పని ప్రదేశాలలో ఆరోగ్యకరమైన మానవ వనరులు మరింత సమానమైన సమాజం కూడా సాధ్యపడుతుంది.

ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2020 నివేదికలో పోషకార అవసరాన్ని గుర్తించింది. ఆకలిని అంతం చేయడం, ఆహార భద్రత, మెరుగైన పోషణను సాధించడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను లక్ష్యంగా పెట్టుకుంది.

ఆక‌లి అనేది ప్ర‌పంచ వ్యాప్త జ‌నాభాలో 9.9శాతం మందిపై ప్ర‌భావం చూపుతోంది. 2019-2020 కాలంలో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే వారి సంఖ్య 161 మిలియ‌న్ల‌కు పెరిగింది. అందుకు వాతావ‌ర‌ణ మార్పుల‌తో పాటు కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కూడా కార‌ణ‌మైంది.

కొన్ని గ్రౌండ్ రియాలిటీస్

గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు

ఐదేళ్లలోపు వారు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు.

పిల్లలు కుంగిపోయారు

పిల్లలు వృధా

అత్యల్ప పనితీరు కనబరుస్తున్నారు.

ఆకలి మరియు పోషకాహార లోపం రేట్లు దేశం యొక్క అభివృద్ధి స్థాయికి అనులోమానుపాతంలో ఉంటాయి. అన్ని వ్యక్తుల పోషక శ్రేయస్సు సమాజాల అభివృద్ధికి ముందే కండిషన్ చేయబడింది మరియు మానవ పురోగతి యొక్క ప్రాధమిక లక్ష్యం.

అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో పేదరికం కూడా పోషకాహార లోపానికి కారణంగా ఉంది. ప్రోటీన్-శక్తి పోషకాహారలోపం, పోషకాహార రక్తహీనత, విటమిన్ ఎ లోపం, అయోడిన్ లోపం ఇతరత్రా లోపం అనారోగ్యాలకు ఉదాహరణలు. అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాల్లో పేదలు ఎక్కువగా మొక్కజొన్న, గొధుమ లాంటి వాటినే తింటారు. కానీ అనేక పండ్లు, కూరగాయలు, మాంసం, చేపలు లాంటివి ఎక్కువగా తినరు. అయితే కొవిడ్ మహమ్మారి కొన్ని వర్గాల్లో పోషకాహార లోపాన్ని పెంచి, రోగ నిరోధక శక్తిని మరింత తగ్గిస్తున్నాయి.

పోషకాహార లోపం కారణంగా వచ్చే వ్యాధులను నివారించడం కోసం ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడంతో పాటు ఆహారం, సూక్ష్మ పోషకాహార పదార్థాలు అందించడం, పోషకాహారం మీద అవగాహన కల్పించడం, ఇన్ ఫెక్షన్ లను తగ్గించడం, ఆర్థిక, సామాజిక సమానతలు పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహాలు అవసరం.

మా విధానం

రాబోయే 10 సంవత్సరాలలో రాష్ట్రం మరియు దేశంలోని బలహీనమైన పిల్లలు, కుటుంబాల ఆహార నాణ్యతను మెరుగుపరచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.

మా కార్యచరణ

మరింత మెరుగైన పోషకాహార వ్యవస్థను నిర్మించడానికి రైతు నుండి వినియోగదారుడి వరకూ పూర్తి పారదర్శకమైన పరిష్కారాలతో కూడిన విధానాలను అవలంబిస్తున్నాము. ఈ విధానం ఉత్పత్తిదారుడికి మంచి లాభాలను సైతం తెచ్చిపెడుతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనల సంస్థలు, ఆహార పరిశ్రమలతో కలిసి బయో ఫోర్టిఫికేషన్ అంశంపై పనిచేస్తోంది.

పోషకాహర లోపం, ఆకలి సంక్షోభం వంటి సమస్యలకు బయో ఫోర్టిఫికేషన్ కీలకంగా మారుతుందని నమ్ముతున్నాము. పరిశోధన, డాటా, విప్లవాత్మక పరిష్కారాలను కనుగోనడం వంటి సమిష్టి చర్యల ద్వారా అధిక పోషకాలు కలిగిన, ఎక్కువ దిగుబడి వచ్చి, స్థానికంగా, తక్కువ ధరకే దొరికే రకాల ద్వారా, పేద రైతుల అవసరాలను తీర్చడంతో పాటు గ్రామీణ ప్రజలు, పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

విధానం

వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలతో కలిసి సహజ పోషకాహార రకాలను గుర్తించి, అధిక దిగుబడి, వాతావరణ అనుకూల రకాలతో అనుసంధానిస్తున్నాము.

అవసరమైన అన్ని లక్షణాలతో కూడిన విత్తనాలను రూపొందించే దిశగా పనిచేస్తున్నాము.

రైతులు, గిరిజన కుటుంబాలకు విత్తనాలు పంపిణీ చేసి, పోషకాహారం గల పంటలను సాగు చేసి వారి కుటుంబాలకు వినియోగించడంతో పాటు, మిగిలిన వాటిని స్థానిక మార్కెట్ లో విక్రయించాము.

అభిప్రాయాలు మరియు ఆమోదయోగిత్య సర్వేలు చేపట్టేందుకు రైతులతో కలిసి పనిచేస్తున్నాము.

ప‌ట్ట‌ణ వినియోగ‌దారుల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు ఆహార ఉత్ప‌త్తిదారుల‌తో అనుసంధాన‌మై ప‌ని చేస్తున్నాము.

Search