మేం ఎవరు
దివంగత డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి గారి జీవితకాల ప్రజా సేవ ఆధారంగా మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ 2012లో స్థాపించబడింది. మా చైర్మన్ మర్రి ఆదిత్య రెడ్డి (దివంగత డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మనవడు) గారి నాయకత్వంతో ఫౌండేషన్ పని చేస్తుంది. పరివర్తనాత్మక మార్పును తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు మరియు భాగస్వాములను రూపొందించాము. ఫౌండేషన్ సాధించిన విజయాల్లో యువతకు సోలార్ సెక్టార్‌లో శిక్షణ, ఉపాధి కల్పన, పంటను క్రిమికీటకాల నుంచి రక్షించేందుకు రైతులతో కలిసి పనిచేయడం, తద్వారా ఆదాయం, ఆహార ఉత్పత్తిని పెంచడం, చేనేత పరిశ్రమ పరిరక్షణకు క్రియాశీలక పాత్ర పోషించడం వంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి.

అసామాన్య రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు డా. మర్రి చెన్నా రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కాలంలో సామాన్య ప్రజల అభ్యున్నతికి, సుపరిపాలన స్థాపనకు తన జీవితాశయాన్ని అంకితం చేశారు. పూర్వ హైదరాబాద్ రాష్ట్రంలో తొలి వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. వారి పరిపాలనా కాలంలో, వారు రాష్ట్ర మరియు దేశ నిర్మాణానికి అసంఖ్యాకమైన కృషి చేశారు. వారు సమర్థుడైన పరిపాలకుడు, వ్యవసాయ సంస్కరణవాది, పాలనలోని దాదాపు ప్రతి అంశాన్ని మార్చారు మరియు ఉత్తేజపరిచారు. నిష్కళంకమైన రాజకీయ జీవితంతో ఆయన తెలంగాణ రాష్ట్ర స్థాపనకు తొలి పునాది వేశారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడంలో డాక్టర్ చెన్నా రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు.

మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ వారి అడుగుజాడల్లోనే ఆశయాలను ముందుకు తీసుకువెళుతోంది. విభిన్న సామాజిక కార్యక్రమాలు మరియు స్థిరమైన జీవనోపాధి పరిష్కారాల ద్వారా సానుకూల సామాజిక ప్రభావం చూపేందుకు పని చేస్తోంది. సంక్లిష్టత లేదా వ్యయాన్ని పెంచకుండా సానుకూల ఫలితాన్ని పెంచడానికి నో-మిస్డ్ అవకాశ విధానాన్ని ఉపయోగిస్తోంది.
“చాలా మందిలో, కొద్దిమంది మాత్రమే సమస్యను గుర్తించగలరు; సమస్యకు ఆచరణాత్మక పరిష్కారం గురించి ఆలోచించగలరు – అరుదుగా కొద్దిమంది మాత్రమే సమస్యను అర్ధం చేసుకొని, పరిష్కర మార్గ రూపకల్పన మరియు పరిష్కార మార్గాన్ని అమలు చేయగలరు. అట్టి గొప్ప వేక్తిత్వం మన డాక్టర్ మర్రి చన్నా రెడ్డి గారిది.”
అభివృద్ధి కోసం ఒక ప్రత్యామ్నాయ విధానం
సమాజంలోని ప్రతి బడుగు, బలహీన వర్గాలు ప్రతిఒక్కరికి మద్థతు ఇవాలని, వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించాలనే విశ్వాసంతో మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ పని చేస్తోంది. రైతులు, యువత, మహిళళు, చేనేతకారులు, హస్త కళాకారులు, గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచి దేశ అభివృద్ధిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు కావాల్సిన ఆర్థిక అవకాశాలు, వసతులను కల్పించడమే ఫౌండేషన్ ప్రధాన ఉద్ధేశ్యం.
దశాబ్ద కాలంలో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చేందుకు పౌండేషన్ లక్ష్యం ఎంతగానో దోహదపడింది. వినూత్న, సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇవ్వడమే కాకుండా వాడిని అమలుపరిచేందు భాగస్వాములను పెంచింది. కాలానుగుణంగా సమాజ అవసరాలకు తగ్గట్లు కార్యక్రమాల కల్పనతో పాటు అమలు జరుగుతూనే ఉంది.
మర్రి చెన్నా రెడ్డి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యాలు: గ్రామీణ మరియు వ్యవసాయ రంగాన్ని మార్చడం, ఉపాధి నైపుణ్య కార్యక్రమాల ద్వారా యువతకు సాధికారత కల్పించడం, మహిళా సాధికారతను సాధించడం, అందరికీ పోషకాహారాన్ని అందేలా చూడటం, చేనేత కార్మికులకు వృద్ధి తద్వారా ఆర్థిక అవకాశాలను అందించడం మరియు విద్యా వ్యవస్థ ప్రాప్యతను బలోపేతం చేయడం. వ్యూహాత్మక భాగస్వాముల ప్రభావం, ప్రమేయాల ద్వారా లక్ష్యాలను సాధించడంతో పాటు సుస్థిర అభివృద్ధి, సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నాం. ఫౌండేషన్ కృషి వల్ల ఇప్పటి వరకు 2లక్షల మందికి పైగా జీవితాలు ప్రభావితం అయ్యాయి.



