అన్ని రకాల ప్రజలు సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు పొందినప్పుడే లింగ సమానత సాధ్యమవుతుంది. లింగ అసమానత మహిళలు, పురుషులు, విభిన్న రకాల ప్రజలు, పిల్లలు, కుటుంబాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. వివిధ వయస్సులు, నేపథ్యాల ప్రజలపై ప్రభావం చూపిస్తుంది.
లింగ సమానత్వం తక్షణం అవసరం. లింగ సమానత్వం మహిళలు మరియు బాలికలపై హింసను తగ్గిస్తుంది. ఆర్థికాభివృద్ధికి ఇది చాలా అవసరం. స్త్రీ పురుషులను సమానంగా చూసే సమాజాలు సురక్షితమైనవి మరియు ఆరోగ్యకరమైనవి. లింగ సమానత్వం ప్రతి మానవుని హక్కు. లింగ సమానత్వం అందరికీ ప్రయోజనకరం.
అసమానతను తగ్గించడానికి ఎంసీఆర్ఎఫ్ తీసుకున్న చర్యల

లింగ-అనుకూల పునరుద్ధరణను దృష్టిలో ఉంచుకుని, డా. మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ అసమానతలను తగ్గించడానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తోంది. ఉమెన్స్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా దేశ మహిళలో సమర్థతను పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నాము.
మహిళల్లో సమాచార లభ్యతను పెంచడం ద్వారా వారిలో వృత్తి పరమైన ఆసక్తి పెంచడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచవచ్చు. ఇందులో భాగంగా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార మరియు స్వయం సహాయక సంఘాలకు ఫౌండేషన్ ద్వారా తగిన సహకారం అందిస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల మహిళలు వివిధ సమస్యలు కారణంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు విద్యను అందించి ఒక మంచి ప్రగతి వేదికను ఏర్పాటు చేయడం ద్వారా, వారు నాయకురాళ్లుగా ఎలాంటి ఆటుపోట్లు లేకుండా జీవించేలా చేయడంతో పాటు, సరైన ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా స్వేచ్చ, ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించవచ్చు. ఆర్థికపరంగా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రేరణ, ప్రోత్సాహం అందించడం, అవకాశాలు అందించడం ద్వారా నిజమైన తేడాను గమనించవచ్చు.

ఇంకా, స్థిరమైన అభివృద్ధి ప్రక్రియలు అట్టడుగు స్థాయి మహిళలకు వారి కుటుంబాలు మరియు సమాజాల జీవన పరిస్థితులను మార్చడానికి మరియు ఈ దుర్బలత్వాలను తిప్పికొట్టడానికి ఉపయోగపడగలవు.
ముందుకు సాగే మార్గం

సమస్యను ప్రాథమిక స్థాయిలో చూసినప్పడు, లింగ అసమానతలను అధిగమించడానికి కేవలం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మాత్రమే కాకుండా, వివిధ వర్గాలు, భాగస్వామ్యులతో కూడి సమగ్ర కార్యచరణ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

మొట్టమెదటగా, మహిళలు తమ పూర్తి సామర్థ్యాలను చేరుకునేలా చేయడం మరియు వారి కుటుంబం, సమాజం వారి పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా చేయడం చాలా అవసరం. ప్రతి సురక్షితమైన, విద్యావంతులైన, ఆరోగ్యవంతమైన మరియు సాధికారత కలిగిన స్త్రీ తన కుటుంబం, సంఘం, ఆర్థిక వ్యవస్థ మరియు సమాజాన్ని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వారికి ఆర్థిక, సాంస్కృతిక మరియు లింగ అడ్డంకులను అధిగమించగల అవకాశాలు అవసరం. ఆర్థిక, సామాజిక మరియు సాంకేతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేయడానికి పురోగతి ఆలోచనలు మరియు పరిష్కారాలను రూపొందించడానికి బహుళ-రంగాల సహకారం అవసరం.
ప్రణాళిక నుండి అమలు స్థాయి వరకు మహిళలను అభివృద్ధి ప్రక్రియలో ప్రధానాంశంగా ఉంచడంపై ఎక్కువగా దృష్టి సారించాలి. అటువంటి రేపటి వైపు పయనించడం భారతదేశాన్ని లింగ సమానత్వం వైపు తీసుకెళ్లడమే కాకుండా, మెరుగైన సమాజాన్ని నిర్మించే అన్ని అంశాలలో శ్రేష్ఠతను చాటుతుంది.