EN

తెలుగు

EN

తెలుగు

లోటు పూడ్చం : లింగ సమానత్వం మరియు ముందుకు సాగే మార్గం

65 కోట్ల మహిళలు గల భారతదేశం, 2021 లో ప్రపంచ లింగ బేధ నివేదికలో 28 స్థానాలు దిగజారి, 156 దేశాల్లో 140 వ స్థానంలో నిలిచింది. 

దేశంలో లింగ అసమానత 62.5 శాతం పెరిగిందని ఈ నివేదిక వెల్లిడిస్తోంది. రాజకీయాలు, వివిధ రంగాల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గడం, ఆరోగ్య ప్రమాణాలు తగ్గడం, స్తీ పురుష నిష్పత్తిలో తగ్గుదల, దేశవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఆర్థిక అసమానతలు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. భారతదేశం రాజకీయ సాధికారతలో అధ్వాన్నంగా ఉంది, 23.9% నుండి 9.1%కి తిరోగమించింది. ఆరోగ్యం మరియు మనుగడ అంశాల్లో భారత స్థానం ఐదు అల్ప ప్రమాణాల్లో ఒకటి. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాల అంతరం 2020తో పోలిస్తే 3% క్షీణతను చూసింది, విద్యా సాధన విషయంలో 114వ స్థానంలో నిలిచాము. 

ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు, విద్యా సాధన, ఆరోగ్యం మరియు మనుగడ, రాజకీయ సాధికారత అనే నాలుగు అంశాల ప్రాతిపాదికలకు లింగ అసమానత నివేదిక ఒక కొలమానం. ఈ సూచీ ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సాధించడానికి 135.6 సంవత్సరాలు పడుతుంది. కరోనా మహమ్మారి పురుషుల కంటే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపింది.

లింగం చాలా కీలకాంశమైనా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి సమస్యలను చూసే కోణంలో నిర్లక్ష్యం చేయబడింది. లింగ అసమానత అనేది నైతిక మరియు సామాజిక సమస్య మాత్రమే కాకుండా క్లిష్టమైన ఆర్థిక సవాలు కూడా. సాపేక్ష ఆర్థిక ప్రాముఖ్యత పరంగా, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో భారతదేశానికి ఎక్కువ భాగస్వామ్యం ఉంది. గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, అనేక తేడాలు ఉన్నాయి. భారతదేశం ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య సంరక్షణలో లింగ అంతరాన్ని తగ్గించినప్పటికీ, ఇతర ముఖ్యమైన అభివృద్ధి సూచికలలో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది.లింగ సమానత్వం ఒక సాధారణ అభివృద్ధి లక్ష్యంగా మారినప్పటికీ పురోగతి నెమ్మదిగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 

కోవిడ్ మహమ్మారి కారణంగా లింగ సమానతలో భారతదేశం సాధిస్తున్న పురోగతి మందగించింది. సూక్ష్మ స్థాయిలో మహిళా సాధికారత కోసం విధానాలను రూపొందించడంతో పాటు, ఉన్న వాటిని కఠినంగా అమలు చేయడం ద్వారా లింగ అసమానతలను తగ్గించవచ్చు. స్థానిక మరియు జాతీయ స్థాయిలలో మార్పును తీసుకురావడానికి చిన్న చిన్న చర్యలు కూడా కీలకమైనవి. అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి లేదా పేదరిక నిర్మూలన, ప్రజలు వారి పూర్తి స్థాయి సామర్థ్యాలను చేరుకునేందుకు దోహదపడే విధంగా ఉండాలి. పెరిగిన ఆర్థిక అవకాశాలు, పునరుత్పత్తి అవకాశాలు మహిళలు, వారి కుటుంబాలు అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. 

Share:

Related Posts

తెలంగాణ చేనేత కార్మికులు: కాలంతో చేస్తున్న నిరంతర పోరాటం

చేనేత పరిశ్రమ తెలంగాణలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగం మరియు వేలాది మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. చేతితో నేసిన సంక్లిష్టమైన డిజైన్లు, మన్నిక గల చేనేత ఉత్పత్తులు రాష్ట్ర  సంస్కృతి మరియు సంప్రదాయాలకు ప్రతీకగా

చేనేత రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్ 

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ చేనేత రంగం విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎవరూ ఊహించని విధంగా కరోనా కారణంగా మార్చి 2020 నుండి  విధించిన లాక్ డౌన్ చేనేత రంగానికి పెను సవాలుగా మారింది.

అసమానతలను తగ్గించడానికి తీసుకున్న చర్యలు

అన్ని రకాల ప్రజలు సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు పొందినప్పుడే లింగ సమానత సాధ్యమవుతుంది. లింగ అసమానత మహిళలు, పురుషులు, విభిన్న రకాల ప్రజలు, పిల్లలు, కుటుంబాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. వివిధ

లోటు పూడ్చం : లింగ సమానత్వం మరియు ముందుకు సాగే మార్గం

65 కోట్ల మహిళలు గల భారతదేశం, 2021 లో ప్రపంచ లింగ బేధ నివేదికలో 28 స్థానాలు దిగజారి, 156 దేశాల్లో 140 వ స్థానంలో నిలిచింది.  దేశంలో లింగ అసమానత 62.5 శాతం

Search